సాయి బృందావనం 24-08-2000 తెల్లవారుజామున 5:36 నిముషములకు ఒం సాయి శ్రీ సాయి అని నామములతో మొదలబెట్టబదింది.
     హైదరబాదు నగరానికి 25 కి.మీ. దూరంలో విజయవాడ రహదారిపై ఉన్న బాటసింగారం గ్రామానికి ఉత్తరంగా 7 కి.మీ. దూరంలో దేశ్ ముఖీ గ్రామం పక్కన ఆరు ఇంజనీరింగు కళాశాలల నడుమ సువిశాలమైన 14 ఎకరాల వాస్తు రీత్యా ప్రాశస్త్య్రం గల స్థలంలో, ఆహ్లాదకరమైన పచ్చని లోయలు గుట్టలతో నిండివున్న సుందర నందన బృందానవియై సాయినాదుని మహిమలతో విరాజిల్లే పుణ్యక్షేత్రం శ్రీ సాయి బృందావనం .నింబ ,అశ్వత్ధ ఓదుంభర వృక్షముల నడుమ దత్తాత్రేయ వనము ,గోశాల , స్వామివారి కోనేరు, దక్షిణమూర్తి వనములతో అలరారుతూ చూచిన వారందరిలో అద్బుత శాంతి బావాన్ని నింపి ,సాయి భక్తి పారవశ్యంతో పులకితులను చేస్తున్నది .క్షేత్రానికి నైరుతిలో శ్రీ సాయి దేవాలయం గురు స్థానంలో కనబడుతుంది.దానికి ఎదురుగా గల కనులకింపైన వాస్తుతో నిర్మితమైన సాయి ధుని ,మరి కొంత దూరంలో గల శ్రీ షిర్డిసాయి ధ్యాన మందిరంలో అహోరాత్రులూ "ఓంసాయి ,శ్రీ సాయి ,జయజయ సాయి" అంటూ అఖండ సాయి నామ సంకీర్తన జరుగుతూవుంటుంది ,ప్రశాంత వాతావరణంలో పచ్చిక బయళ్ళతో పరివేష్టితమైన వీటి పక్కనే వి.ఐ.పి.ల విశ్రాంతి మందరం ,దానికి పక్కనే సాయి బృందావన పరిపాలన కార్యాలయం వీటికి అల్లంత దూరంలో వంటసాల వృద్దశ్రమం కనబడతాయి .శ్రీ సాయి నాదుని విగహాలు సాయి నాదుని దర్శనంతో బాటు విహార యాత్రకు వచ్చిన బావన కలుగుతుంది. సాయి బృందావనంలో సాయి నాదుని వద్దకు వచ్చిన వారందరింకీ బీద గొప్ప తేడా లేకుండా శ్రేష్టమైన శాకాహారవంటకాలను శుచి శుబ్రతలతో శాకకళా ప్రావిణ్యులైన వంట బ్రాహ్మ్ననులచే తయారుచేయించి బోజనము వడ్డిస్తున్నారు.నిత్యం వందల సంఖ్యలుగా భక్తులకు అన్న ప్రసాద కార్యక్రమం వితరన శెలురైన సాయి భక్తులు సహయసహాకారాలతో సంవస్తారాలతరబడి అవిగ్నంగా నడుస్తున్నది.